పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో గందరగోళం ఏర్పడింది. భారీగా పార్టీ శ్రేణులు లోహార్‌లోని జమాన్ పార్క్ రెసిడెన్సీకి చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రి పదివిలో ఉండగా విదేశీ పర్యటనలో వచ్చిన బహుమతులను అమ్మేసారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే ఒక్కసారి కూడా ఇమ్రాన్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసి మార్చి7 తేదీ నాటికి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో ఇమ్రాన్ ఇంటికి చేరుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు.తమ నాయకుడిని అరెస్ట్ చేస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేస్తామని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
తనను అరెస్ట్ చేయడానికి పోలీసు రావడంతో ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు. అవినీతి పరులు, నేరగాళ్లు పాలన సాగించడంతోనే తమ దేశం పతనానికి దారితీసిందని ఆరోపించారు. ఇండియా ఛానెళ్లు చూస్తే పాకిస్తాన్ ఎందుకు విమర్శలకు గురవుతుందో తెలుసుకోవచ్చన్నారు. అవినీపరుడిని దేశ ప్రధానిగా చేయడంతో దిగజారిపోయామన్నారు. దేశ అగ్రనేతలే నేరస్థులైతే దేశం ఏమంతుందని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.