Imran Khan Injured In Firing At Pakistan Rally
mictv telugu

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు

November 3, 2022

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని జాఫర్‌ అలీ ఖాన్‌ చౌక్‌లో జరిగిన ర్యాలీలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.. దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో పాకిస్థాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.