శివుడిగా ఇమ్రాన్ ఖాన్! భగ్గుమన్న పాక్ పార్లమెంట్   - MicTv.in - Telugu News
mictv telugu

శివుడిగా ఇమ్రాన్ ఖాన్! భగ్గుమన్న పాక్ పార్లమెంట్  

April 12, 2018

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను హిందువుల దేవుడైన శివుడిగా తయారు చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పాకిస్తాన్‌లోని హిందువులతోపాటు, మెజారిటీ ముస్లింలు కూడా మండిపడుతున్నారు. పాక్ పార్లమెంటు కూడా భగ్గుమంది. దీన్ని ఎవరు తయారు చేశారో గుర్తించి రెస్ట్ చేయాలని హోం శాఖ పోలీసులను ఆదేశించింది. ఈ ఫొటో తతంగాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ రమేష్ లాల్ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. అధికార పీఎంఎల్ఎన్ కార్యకర్తలే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ పార్టీ హిందువులు మనోభావాలను గాయపరిచిందని ధ్వజమెత్తారు. ఈ మార్ఫింగ్ ఫొటోను ఈ నెల 8న పీఎంఎల్ఎన్ మద్దతుదారుడు పోస్ట్ చేశాడు. కాగా, పాక్‌లోని హిందువుల ప్రయోజనాలను కాపాడ్డానికి తాము కట్టుబడి ఉంటామని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్పష్టం చేసింది. హిందువులను, కలాస్ మతస్థులను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని గతంల ఇమ్రాన్ కూడా ఆరోపించారు.