ఇమ్రాన్ పాలనలో ప్రజలు విసిగిపోయారు.. బిలావల్ బుట్టో - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్ పాలనలో ప్రజలు విసిగిపోయారు.. బిలావల్ బుట్టో

October 21, 2019

Pakistan's .

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై, ఆయన పాలనా తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ(పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ బుట్టో జర్దారీ ఆరోపించారు. ఆదివారం జిన్నా మెడికల్ పీజీ కళాశాలను సందర్శించిన బిలావల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన వెంట సింధ్‌ ముఖ్యమంత్రి మురాద్‌ అలీ షా తదితరులు ఉన్నారు. మీడియా వర్గాల సమాచారం మేరకు.. పాకిస్తాన్‌లోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలతో పాటు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే దిశలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని.. ప్రజలకు మంచి పాలన అందించడంలో సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశంలోని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు లేవనెత్తుతున్నారని దుయ్యబట్టారు. 

ఇమ్రాన్‌ఖాన్‌కు తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం లేదని ఎద్దేవా చేశారు. కీలుబొమ్మలా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంతో ప్రజలు అందరూ విసిగిపోయారని అన్నారు. తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది, కానీ ప్రజాస్వామ్యం దెబ్బతీసే చర్యల్లో పాల్గొనదని చెప్పారు. పాక్‌ ప్రజల్లో ఐక్యతా, ఏకాభిప్రాయం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.