Home > Featured > భారత్‌తో మేము గెలవలేం.. ఇమ్రాన్ ఖాన్

భారత్‌తో మేము గెలవలేం.. ఇమ్రాన్ ఖాన్

Imran Khan on 'genocide' in Kashmir

పాకిస్తాన్ ప్రధాని మాటలు తూటాల్లా పేలుతున్నాయి కానీ, చర్యలు పేలడంలేదు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ నానా యాగీ చేస్తూ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై వరుసగా విమర్శలు చేస్తూ నవ్వులపాలు అవుతూ వస్తున్నారు. ఎప్పుడుచూసినా మేము తోపు అంటే తురుము అన్న లెవల్లో కామెంట్లు చేసే ఇమ్రాన్ ఈసారి పంథా మార్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

భారత్‌తో యుద్ధంలో ఓడిపోతామని ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా అంగీకరించారు. అల్‌ జజీరా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ఖాన్ ఇలా వ్యాఖ్యానించారు.

సాంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్‌ ఓడిపోవచ్చు కానీ రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే అణ్వస్త్రాలతోనే ముగుస్తుందని అన్నారు.

కాగా, జమ్మూ కశ్మీర్ అంశంలో తమ వాదనకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తాయని అనుకున్నాం.. కానీ, ఏ దేశం కూడా తమకు అండగా నిలవలేదు. దీనంతటికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య అంశాలే. ఇందులో భారత్ గొప్పతనం ఏ మాత్రంలేదు అని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల గురించి మరిచిపోక ముందే ఆయన ఇలా మెట్టు దిగి మాట్లాడటంపై సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

Updated : 15 Sep 2019 5:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top