భారత్‌ను దెబ్బకొట్టేవాళ్లమే, కానీ.. మిస్సైల్ ఘటనపై ఇమ్రాన్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ను దెబ్బకొట్టేవాళ్లమే, కానీ.. మిస్సైల్ ఘటనపై ఇమ్రాన్

March 14, 2022

iii

భారత్‌కు చెందిన సూపర్ సోనిక్ రేంజ్‌కి చెందిన క్షిపణి పాకిస్తాన్‌లో పడిన ఘటనపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ‘మిస్సైల్ పడిన వెంటనే పాక్.. తీవ్రంగా స్పందించేదే. కానీ వైఖరికి భిన్నంగా ఓపిక పట్టాం’ అంటూ వ్యాఖ్యానించారు. తమ దేశ రక్షణను మరింత పటిష్టం చేసుకుంటామని తెలిపారు. కాగా, దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణనిచ్చింది. పొరపాటున జరిగిందంటూ చెప్పుకొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఘటన జరిగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే, భారత్ స్పందనపై పాక్ అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ ఉమ్మడిగా జరగాలని డిమాండ్ చేసింది. అనుకోకుండా జరిగిందే అయితే వెంటనే మమ్మల్ని అప్రమత్తం చేయాలి కదా అంటూ ప్రశ్నించింది. మరోవైపు కొందరు విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. పాక్ గగనతల రక్షణ వ్యవస్థ ఎలా ఉందో చెక్ చేయడానికే మిస్సైల్ ప్రయోగం నిర్వహించినట్టు పేర్కొంటున్నారు. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకుంటున్నట్టు, భారత్ కూడా పాక్ ఆధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి చేజిక్కించుకునే వ్యూహంతో ఉందని జోస్యం చెప్తున్నారు.