‘దొంగలు, బిచ్చగాళ్లతో నేను కూర్చోలేను.. రాజీనామా చేస్తున్నా’ - MicTv.in - Telugu News
mictv telugu

‘దొంగలు, బిచ్చగాళ్లతో నేను కూర్చోలేను.. రాజీనామా చేస్తున్నా’

April 11, 2022

ngnxg

ప్రధాని పదవికి రాజీనామా చేసిన పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేశారు. తనతో పాటు పార్టీ సభ్యులందరి చేత రాజీనామా చేయించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘దొంగలతో నిండిన ఈ అసెంబ్లీలో నేను కూర్చోలేను. ధన దాహం, అధికార లాలస నా దేశాన్ని బిచ్చమెత్తుకునేలా చేసింది. ఇలాంటి వాళ్లను దేశ పాలకులుగా గుర్తించాలా? అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి 8 గంటలకు నూతన ప్రధాని ఎన్నిక, ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం కనిపిస్తోంది. నూతన ప్రధానిచేత ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ – ఎన్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షహబాజ్ షరీష్ స్వంత సోదరుడు.