దేశం అంతా మార్మోగుతున్న పేరు డేరా సచ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్. మన దేశంలో ఓ బాబాను అరెస్టు చేస్తే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలే వణికి పోవడం తొలి సారి కావొచ్చు. సాధారణంగా పేరున్న వారిని అరెస్టు చేస్తే భద్రత ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యలూ ఉంటాయి. కానీ గుర్మిత్ అరెస్టుకు ముందు నుండీ పంజాబ్, హర్యాణ ప్రభుత్వాలు ఆయన భక్తులకు విజ్జప్తి చేశాయి. శాంతంగా ఉండాలని కోరాయి. బాబాలకు భక్తులు ఉండటం… వారు స్పందించడం కొత్త కాదు. కాకా పోతే ఇంతలా స్పందించడమే కొత్త.
అంతేకాదు గుర్మిత్ అరెస్టు సందర్భంగా జరిగిన అల్లర్లలో రెండు జన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇంత విధ్వంసం జరగడం ఇదే తొలి సారి కావొచ్చు. ఓ బాబాను అరెస్టు చేస్తే ఇంత మందికి ఎందుకు స్పందించారు. ఇంత డేర్ వారికెట్లా వచ్చింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రెస్పాండ్ కావాల్సినంత ప్రభావం అయన ఎట్లా చూపించగలిగాడు. ఇదే అందర్నీ తొలుస్తున్న ప్రశ్న.
గుర్మిత్ సింగ్ అందరి లాగే సర్వసాధారణ బాబా మాత్రమే కాదు. అంతుకు మించి అక్కడి జనాలను ప్రభావితం చేస్తున్నారు. ఆయన అనుచరుల్లో మెజార్టీ దళితులు, ఎస్టీలు, బిసిలే ఉన్నారు. అగ్రకులాల వేధింపులను, చీదరింపులను, దాడులను ఎదుర్కొనేందుకు వివక్ష నుండి తమను తాము కాపాడుకునేందుకు భారీ సంఖ్యలో దళుతులు డేరా సచ్చా సౌదాలో చేరుతున్నారు. ఇది ఇప్పటిది కాదు 1940లకు పూర్వం నుండే ఉన్నది.
గుర్మిత్ సింగ్ కంటే ముందు నుండి డేరాల్లో చేరడం ప్రారంభం అయింది. ఇదంతా కూడా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, తమను తాము రక్షించుకునేందుకు అట్టడుగు వర్గాల ప్రజలు అటు వైపు వెళ్తున్నారు. ఇట్లా గుర్మిత్ అభిమానులు, అనుచరులు దగ్గదగ్గర ఆరు కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మద్దతు దారులున్నారు.
కింది కులాల ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదపాయాలు కల్పిస్తున్నారు ఈ బాబా. అంతే కాదు రోగం ఎంత పెద్దదైనా వైద్యం ఉచితంగానే ఇస్తున్నారు. ఏదైనా ఉత్పతాలు సంభవిస్తే గుర్మిత్ బాబా తాను సాయం అందించేందుకు రెఢీగా ఉంటారు. ఇంతేనా అంటే ప్రభుత్వం చౌక ధరల దుకణాల నుండి ఇచ్చే సరుకుల కంటే బాబా ఇచ్చే సరుకులు మంచి క్వాలిటీతో ఉంటాయి. అదీ సబ్సిడీతో ఇచ్చేవే. ప్రభుత్వ యంత్రాంగం మాదిరిగా బాబాకు పెద్ద యంత్రాంగమే ఉంది. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నారట.
మరింత చేసిన తర్వాత బాబాకు మద్దతు లేకుండా ఉంటుందా. వేలాది మంది జనం వెంట రాకుండా ఉంటారా. బాబా కేసు విచారణకు వస్తుందని తెల్సిన వెంటనే పంజాబ్, హర్యాణ, రాజస్తాన్ల నుండి పెద్ద సంఖ్యలో బాబా అనుచరులు హర్యాణలోని పంచకుల సిబిఐ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. హర్యాణలోని సిర్సాలో బాబా ప్రధాన కార్యాలయం సుమారు 800 ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడా ఆయన మద్దతు దారులే ఉన్నారు. తినే తిండి నుండి విద్య, వైద్యం, సదుపాయలు కల్పిస్తున్నారు కాబట్టే బాబా వెంట ఇంత మంది వస్తున్నారట. వారి డేర్ కు కారణం ఇదేనట. అందుకే ఈయన తీసిన సీన్మా వంద కోట్లు వసూలు చేసిందంటే ఈయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.