పాక్ పైత్యం.. జమ్మూకశ్మీర్ తనదేనంటూ కొత్త మ్యాప్  - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ పైత్యం.. జమ్మూకశ్మీర్ తనదేనంటూ కొత్త మ్యాప్ 

August 4, 2020

In a landmark move, PM Imran unveils 'new political map' of Pakistan, .

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ మరో నిర్వాకం వెలగబెట్టుకుంది. జమ్మూకశ్మీర్‌లోని మెజారిటీ ప్రాంతాలను తనవి చూపుకుంటూ మ్యాప్ తయారు చేసుకుని స్వీయతృప్తి పొందుతోంది. దీన్ని తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించారని పాక్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. ఇకపై అదే తమ దేశ మ్యాప్ అని చెప్పుకొచ్చింది. జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని భారత్ అధీనంలోని ప్రాంతంగా చూపుకుంటూ పాక్ మ్యాపులో కలిపేసుకున్నారు. తూర్పు సరిహద్దును కూడా గీత సరిగ్గా గీసుకోకుండా అస్పష్టంగా ముగించేసుకున్నారు. 

ఈ మ్యాపును పాక్ మంత్రి  మండలి ఆమోదించిందట.  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈరోజు పాకిస్తాన్ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు అని, ప్రపంచం ముందు  పాకిస్తాన్ సరికొత్త చిత్ర పటాన్ని తీసుకొచ్చిన రోజు’ అని చెప్పుకొచ్చారు.