ఏపీలో.. 9 జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో.. 9 జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

May 11, 2022

‘అసని’ తుపాన్ కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 9 జిల్లాలో కంట్రోలు రూమ్‌లను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం..”శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచాం. ఒంగోలు కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ 1077, పోలీస్ వాట్సప్ నంబర్ 9121102266.”

మరోపక్క బాపట్ల జిల్లాకు చెందిన రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో అధికారులు కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 87126 55878, 87126 55881, 87126 55918గా తెలిపారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 34 మిల్లీ మీటర్ల వర్షం పడుతుందని అధికారులు వెల్లడించారు.