బీహార్లో దారుణం జరిగింది. హోలీ రోజు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. మద్యం మత్తు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికతోపాటు ఉన్న మరో బాలికపై కూడా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాహెపూర్ కమల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో హోలీ పండగ రోజు ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలు సరుకులు కొనేందుకు మార్కెట్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా..అదే గ్రామానికి చెందిన వ్యక్తి వారిని సమీప పాఠశాలలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డగించిన మరో బాలికను తీవ్రంగా కొట్టాడు.
గాయపడిన అమ్మాయి ఆ దుర్మార్గుడిని తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే పాఠశాలకు వెళ్లి చూడగా…బాధిత బాలిక పడిపోయి కనిపించింది. చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముగ్గురు పిల్లలకు తండ్రి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నిషిత్ ప్రియా తెలిపారు.