బాక్సింగ్‌‌లో.. చరిత్ర సృష్టించిన తెలంగాణ యువతి - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సింగ్‌‌లో.. చరిత్ర సృష్టించిన తెలంగాణ యువతి

May 20, 2022

దేశవ్యాప్తంగా ప్రస్తుతం భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్ గురించే తెగ చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన జరీన్.. ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను సాధించటంపై రాజకీయ నాయకులు,  వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు, సామాన్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో జరిగిన ఫైనల్లో జరీన్.. 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది.

మూడు రౌండ్లపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల నిఖత్‌.. ప్రత్యర్థిపై ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. దాంతో 30-27, 29-28, 29-28, 30-27, 29-28 స్కోరింగ్‌తో జడ్జీలు ఏకగ్రీవంగా విజేతను ప్రకటించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన, ఐదోవ భారత బాక్సర్‌గా నిఖత్‌ నిలిచింది. గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ జెన్నీ, కేసీలేఖ ఈ ఫీట్‌ సాధించారు. చివరిసారిగా 2018లో మేరీకోమ్‌ (48కేజీ) భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షిప్ సాధించగా, నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ బాక్సర్‌ దేశానికి స్వర్ణం అందించి, చరిత్ర సృష్టించింది.

జరీన.. ఈ బాక్సింగ్ రంగంలోకి 18 ఏళ్ల వయసులోనే తలపడాలని నిర్ణయించుకుందట. అమ్మాయిలు బాక్సింగ్ చేయొచ్చా లేదా అని తండ్రిని అడిగితే.. ‘అమ్మాయిలకు బలం తక్కువగా ఉంటుంది, అందుకే అమ్మాయిలు బాక్సింగ్ చేయరు. అబ్బాయిలు మాత్రమే చేస్తారు’ అని ఆయన నవ్వుతూ సమాధానం చెప్పాడట. దాంతో ఆమె ఏలాగైనా బాక్సింగ్‌లో మహిళల బలాన్ని చాటాలని ఫిక్స్ అయ్యి, చేతులకు గౌడులు తొడిగి రింగ్‌లో అడుగుపెట్టిందట.నేరుగా అబ్బాయిలతోనే ప్రాక్టీస్ చేసి దెబ్బలు తిన్నదట. అయినా, ధైర్యంగా నిలబడి, పోరాటాన్నే నమ్ముకుందట. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. ప్రపంచ చాంపియన్‌షిప్‌గా నిలిచిన మొదటి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.