ఏలూరులో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏలూరులో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

April 14, 2022

5

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగి, ఆరుగురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన.. యూనిట్‌-4లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ”విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. అయితే, మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. మిగిలిన 12 మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప, అందరి పరిస్థితి విషమంగానే ఉంది. 70 శాతంపైగా వారికి గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నాం” అని ఆమె తెలిపారు.

మరోపక్క ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయ్యాలని డిమాండ్ చేస్తూ, గ్రామస్థులు గురువారం ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల గ్రామంలోని ప్రజలందరు అనారోగ్యానికి గురవుతున్నామని ధర్నా చేపట్టారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.