In hyderabad Asia largest us consulate open in 2023
mictv telugu

అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ ఇప్పుడు హైదరాబాద్ లో..

November 29, 2022

ఆసియాలోనే అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ 2023లో హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రారంభం కానుంది. 12.2 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయంలో 54 వీసా ప్రాసెసింగ్ విండోస్ ఉంటాయి.

యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ ఈ కార్యాలయం ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జెన్నిఫర్.. ‘ఎంతో అందమైన బిల్డింగ్. 2023 ప్రథమార్ధం నాటికి కొత్త కార్యాలయం తెరవాలని లక్ష్యంగా పెట్టకున్నాం’ అంటూ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) గోల్డ్ స్థాయిగా ఈ భవనాన్ని ధృవీకరించింది. ఈ భవనం కోసం ఈ సంస్థ సుమారు 297 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.


హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం 2009లో స్థాపించబడింది. ఇది 1947 తర్వాత భారతదేశంలో ప్రారంభించబడిన మొదటి యూఎస్ దౌత్య కార్యాలయం. ప్రస్తుతం ఇది బేగంపేట్ లోని చిరాన్ ఫోర్ట్ లేన్ లోని పైగా ప్యాలెస్ లో ఉంది. హైదరాబాద్ కాన్సులర్ మూడు రాష్ట్రాలను కవర్ చేస్తుంది. అవి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా.

పైగా ప్యాలెస్
సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించిన చారిత్రాత్మక భవనం. ఇది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండతస్తుల భవనంలో ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో రాజభవనాలను నిర్మించే వారిలో అగ్రగామిగా పేరొందిన పైగా కుటుంబం దీన్ని నిర్మించారు. హైదరాబాద్ లోని నిజాంల తర్వాత వీరిదే రాజ కుటుంబం.

నిరీక్షణ తప్పదు..
అమెరికా, భారతదేశం మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయం తగ్గడం లేదు. ప్రస్తుతం మొదటిసారి సందర్శకుల వీసాల కోసం వెయ్యి రోజులు ఆగాల్సిందే. అంటే.. ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే 2025లో అపాయింట్మెంట్ దొరకవచ్చు. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ల వద్ద రియల్ టైమ్ వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార వెబ్సైట్ https://travel.state.gov/content/travel/en/us-visas/visa-information-resources/wait-times.html ని క్లిక్ చేయండి.