In india Sanitary pads contain high amount of chemicals its cause cancer
mictv telugu

ఇండియాలో అమ్మే ప్యాడ్లలో ప్రమాదకర కెమికల్స్!

November 23, 2022

హడావిడి జీవితంలో ఆడవాళ్లకు ఎన్నో ఆటంకాలు. అందులో రుతుక్రమం ఒకటి. ఆ రోజులు సాఫీగా సాగిపోవాలంటే శానిటరీ ప్యాడ్స్ వాడాల్సిందే! కానీ వీటిని వాడడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అని ఒక అధ్యయనం చెబుతున్నది.

ఆడవాళ్లకి నెలలో ఆ ఐదు రోజులు గడువాలంటే గగనమే. ఇంట్లో పనిచేసే వారికైనా, బయట ఆఫీసుల్లోకి వెళ్లెవారైనా.. ఆటలు ఆడే అమ్మాయిలకైనా.. స్కూళ్లకు వెళ్లే పడతులకైనా.. ఎవరికైనా ఆ ఐదు రోజుల బాధ తప్పదు. ఆ రోజుల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే ప్యాడ్స్ వాడడం కంపల్సరీ. కానీ వాటిలో అధిక మొత్తం ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయట. వీటి వల్ల.. పిల్లలు పుట్టకపోవడం, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ వస్తుందని ఢిల్లీకి చెందిన ఒక ఎన్జీవో చేసిన పరిశోధనలో తేలింది. వీరి పరిశోధన కోసం.. మొత్తం పది శాంపిల్స్ని తీసుకున్నారు. అందులో ఆరు ఇన్ ఆర్గానిక్, నాలుగు ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్లు మన ఇండియన్ మార్కెట్లలో లభ్యమవుతున్నాయని వెల్లడించారు. ఈ రిపోర్ట్కి ‘మెనుస్ట్రుల్ వేస్ట్ 2022’ అని పేరు పెట్టారు.

ఆర్గానిక్లో కూడా..

ఆర్గానిక్ అని చెప్పే నాపికన్స్లో కూడా అధిక మోతాదులో థాలేట్స్ ఉన్నాయని అధ్యయనం చెబుతున్నది. ఒక రకమైన థాలేట్లు ఆర్గానిక్ ప్యాడ్లలో 19,460మైక్రోగ్రామ్/కేజీ గరిష్ఠ సాంద్రతలో ఉన్నాయి. అయితే థాలేట్ల సాంద్రత కలయిక ఆర్గానిక్లో 10.032, ఇన్ ఆర్గానిక్లో 0.0224 ఉన్నట్లు కనుగొన్నారు. ఈయూ నిబంధనల ప్రకారం నిర్దేశించబడిన ఉత్పత్తి బరువుతో పోలిస్తే 0.1శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. శానిటరీ నాప్కిన్ల నమూనాలో 25 అస్థిర కర్బన సమ్మేళనాలు ఉన్నాయని తేలింది. వీటిలో అసిటోన్, క్లోరోఫామ్, బెంజిన్, టోల్యున్..ఇతర సమ్మేళనాలు ఉన్నాయని తేలింది. అవి కూడా ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ వాటిలో కనపడ్డాయి. ఆర్గానిక్ శాంపిల్స్లో కూడా అధిక వీఓసీ ఉన్నట్లు తేలింది.

సూచనలు..సలహాలు..
రుతుక్రమం అప్పుడు సురక్షితమైన ఉత్పత్తులు కావాలని అనుకుంటారు. సుమారు ఒక మహిళ తన జీవితకాలంలో సగటున 1800వరకు శానిటరీ ప్యాడ్లు వాడుతున్నారు. ఇటీవలి కాలంలో.. ప్యాడ్లకు మృదుత్వం రావడానికి, సువాసన, అధిక తాజాదనాన్ని అందించడానికి సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్ని వాడుతున్నారు. దీనివల్ల ఎక్కువకాలం ఇది లిక్విడ్ పీల్చుకునేలా మారుతుంది. ఇవన్ని పక్కన పెడితే ఈ ఎన్జీవో ప్యాడ్ తయారీ సంస్థలకు కొన్ని సూచనలిస్తున్నది. అవేమంటే.. మొదటగా ఈ ఉత్పత్తుల్లో వీఓసీ, థాలేట్ల గురించి పూర్తిగా పరిశోధన చేసిన తర్వాతే వీటిని తయారీ చేయాలి. రెండవది ప్రభుత్వం ప్రమాణాల తయారీ సంస్థలు శానిటరీ ఉత్పత్తుల్లో రసాయనాల కోసం ప్రమాణాలు రూపొందించాలి. మూడవది.. పదార్థాల జాబితాను ఉత్పత్తిదారులకు బహిర్గతం చేయాలి. నాల్గవది.. ఉత్పత్తి సంబంధిత సమాచారం, తగిన హెచ్చరికలను తమ ప్రకటనల ద్వారా కచ్చితంగా తెలియచేయాలి. చివరగా ఈ రసాయనాల వినియోగంలో ప్రత్యామ్నాయం లేదా తగ్గింపు చేయాలంటున్నదీ సంస్థ.