జనసేనలో.. మరి నేను?: బండ్ల గణేష్ - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనలో.. మరి నేను?: బండ్ల గణేష్

March 30, 2022

nnnnn

టాలీవుడ్ కమెడియన్, నిర్మాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్విట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే చాలాసార్లు పవన్ కల్యాన్ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమాలలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం, ఒక్కసారి అలవాటైతే చచ్చేవరకు వదలం. పవన్ కల్యాణ్ కోసం నా ప్రాణమైన ఇస్తా. ఆయన నా దేవుడు. నేను ఆయన భక్తున్ని, ఆయన కోసం నేను దేనికైనా సిద్ధం” అంటూ బండ్ల గణేష్ బహిరంగంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

 

ఈ క్రమంలో బండ్ల గణేష్ తాజాగా జనసేనలో నేను లేనా? అంటూ ట్వీట్ చేయడంతో మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు గుప్పుమంటున్నాయి. “చిరంజీవి గారు జనసేనలోకి రావాలి, పార్టీని అధికారంలోకి తేవాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడులోని సౌమ్యం మీరు లక్ష్మనుడిలోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే శ్రీరామ రాజ్యం అవుతుంది. జై జనసేన జై పవన్ కళ్యాణ్” అని ఒక అభిమాని చేసిన ట్విట్‌కి బండ్ల గణేష్ మరి నేను అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో జనసేనలో బండ్ల గణేష్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేక జనసేనలో జాయిన్ అవ్వడానికి బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నాడా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.