దంపతుల చెరో అక్రమ సంబంధం.. భర్త ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే - MicTv.in - Telugu News
mictv telugu

దంపతుల చెరో అక్రమ సంబంధం.. భర్త ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే

May 4, 2022

కుటుంబ యజమాని అయిన భర్త సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో తెలియజెప్పే సంఘటన ఇది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్చూరు మండలంలోని తన్నీరువారి పాలెంకు చెందిన ప్రసాదు, శ్రీలక్ష్మి దంపతులు ఉన్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు ఇంటికి వచ్చిన భర్త ఇంటిలోని దృష్యాన్ని చూసి అవాక్కయ్యాడు. భార్య ఇంకో వ్యక్తితో సరసాలాడుతూ భర్త కంటపడింది. దీంతో భార్యకు నచ్చజెప్పి ఇకపై ఇద్దరం కలిసి ఉందామని మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లాడు. పొలంలో భార్యచేత బలవంతంగా పురుగుల మందు తాగించి అక్కడ నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు శ్రీలక్ష్మిని గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. భర్త ప్రసాదు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.