అంగాన్ని కోసుకుని శివలింగానికి సమర్పించిన ఖైదీ - MicTv.in - Telugu News
mictv telugu

అంగాన్ని కోసుకుని శివలింగానికి సమర్పించిన ఖైదీ

May 5, 2020

In prison, the prisoner cut the private part and offered it to the Shivalinga, said – At the behest of Bholenath, he did this

శివభక్తుడైన భక్త కన్నప్ప శివ లింగానికి ఉన్న కళ్ల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని తన కళ్లను బాణంతో పొడిచి తీసి శివలింగానికి సమర్పిస్తాడు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఓ మూఢ భక్తుడు శివలింగానికి ఏం సమర్పించాడో తెలిస్తే షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీ శివలింగానికి అతని అంగాన్ని కోసి సమర్పించాడు. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనతో జైలులో ఒక్కసారిగా కలకలం రేపింది. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాకు చెందిన విష్ణుసింగ్ అనే ఖైదీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

అతను ఓ హత్యకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఆరోజు ఉదయం తన గదిలోని స్పూన్‌ను ఓ రాయికి బాగా రాసి మొనదేలేలా చేశాడు. దానితో తన పురుషాంగాన్ని కోసుకుని.. దానిని జైలు పరిసరాల్లో ఉన్న శివ లింగానికి సమర్పించాడు. తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులో ఉన్న అతడిని గుర్తించిన జైలు సూపరిండెంట్ అధికారులు వెంటనే  ఆసుపత్రికి తరలించారు. విష్ణు సింగ్ తనకు తానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా.. లేకపోతే ఇతర ఖైదీలు ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.