పులిపై రాళ్లేశాడు.. 51 వేల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

పులిపై రాళ్లేశాడు.. 51 వేల జరిమానా

April 24, 2019

జూకు వెళ్లినవాళ్ళు అందులో వున్న పులులు, సింహాలు ఏమీ అనవు అనుకుంటారు. అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కుల్లో పడుతుంటారు. జూ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఒక్కోసారి ఆ క్రూర జంతువల ఎన్‌క్లోజర్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఇప్పటికి చాలా చోటు చేసుకున్నాయి. ఈ ఘటన కూడా అలాంటిదే. జూలో తన మానాన తను హాయిగా పడుకున్న పులి మీదకు రాళ్లు రువ్వాడో పోకిరీ సందర్శకుడు. అది ఊరుకుంటుందా.. ఎన్‌క్లోజర్ అడ్డు లేకుంటే మీద పడి రక్కి, నాలుగు ఖండాలుగా చీల్చి తినేసేది. ఎన్‌క్లోజర్ వుండటంతో బతికిపోయాడు. అది గట్టిగా గాండ్రించింది. ఇది గమనించిన పులుల సంరక్షణాధికారి సదరు పర్యాటకుడితో పాటు అతని గైడ్‌గా వ్యవహరించిన వ్యక్తిపై భారీ జరిమానా విధించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగింది.

In Rajasthan, tourist, guide fined Rs 51,000 for throwing stones at the tiger
జైపూర్ సమీపంలోని రణతంబోర్ జాతీయ టైగర్ రిజర్వులో ఓ పర్యాటకుడు, గైడర్‌తో వచ్చాడు. పార్క్‌లోని జోన్‌-6లో ఉన్న పిలిఘాట్ గేట్ నుంచి వీరు ఒక జిప్సీలో పార్క్‌లోకి ప్రవేశించారు. గైడర్ పార్క్ గురించి సదరు పర్యాటకుడు కెమెరాతో ఫోటోలు తీసుకుంటున్నాడు. అక్కడికి కొంతదూరంలో అతనికి నిద్రపోతున్న ఓ పులి కనిపించింది. అది నిద్రలేస్తే ఫోటోలు తీసుకుందామనుకుని దానిపై రాళ్లు విసిరాడు. పులి లేచి పెద్ద శబ్దాలతో గాండ్రించసాగింది. ఇదంతా స్థానిక పులుల సంరక్షణాధికారి గమనించాడు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందేనని అనుకున్నాడు. పర్యాటకుడితో పాటు గైడర్‌కు రూ.51,000 జరిమానా విధించాడు. దీంతో పర్యాటకుడి నోటిమాట లేక ఆశ్చర్యపోవడం అతని వంతైంది.