తిరిగి ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ - MicTv.in - Telugu News
mictv telugu

తిరిగి ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ

May 29, 2020

Ramesh Kumar.

జగన్ ప్రభుత్వానికి షాకిస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఎన్నికల కమిషనర్‌ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, రెండు రోజుల్లో విజయవాడ వెళ్లనున్నారు. 

తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తాను. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తాం. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతం. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను’ అని ఆయన తెలిపారు. కాగ, కోర్టు తీర్పుతో గత కొన్ని రోజులుగా మూతపడ్డ ఏపీఎస్‌ఈసీ కార్యాలయం సోమవారం తిరిగి తెరుచుకోనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించాక ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి జీఏడీ సీల్‌ వేసింది.