తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి డిగ్గీ రాజా రిటైర్డ్..! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి డిగ్గీ రాజా రిటైర్డ్..!

August 1, 2017

కాంగ్రెస్ అధిష్టానం కేటీ ఆర్ సలహాను పాటించినట్టుంది.డిగ్గీ రాజాను రిటైర్ కమ్మని కేటీఆర్ ఇచ్చిన సలహాకు పదిరోజులు కూడా కాలేదు,అప్పుడే కాంగ్రెస్ పార్టీ పెద్దలు డిగ్గీరాజాను  తెలంగాణ బాధ్యతలనుంచి తప్పించడం కొత్త చర్చలకు దారి తీస్తుంది.చాలా కాలంగా దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ తరపున చూస్తున్న సంగతీ అందరికి తెలిసు.తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డిగ్గీ రాజానే కాంగ్రెస్ పెద్దగా వ్యవహరించారు.2014 జనరల్ ఎలక్షన్స్ కి ముందు  టీఆర్ ఎస్ పార్టీతో తెగతెంపుల కార్యక్రమంలో  డిగ్గీ రాజాది కీలక పాత్ర అని అప్పుడు గుసగుసలు వినపడ్డాయి.

కేసీఆర్ కు తెలంగాణ లో అంత సీన్ లేదు,ఒకవేళ ఎలక్షన్స్ కి పోతే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలదే హవా అనే ఇన్పుట్స్ ను సోనియాకి దిగ్విజయ్ సింగే ఇచ్చినట్టు అప్పట్లో బాగా ప్రచారం నడిచింది.దీనితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆగమైందని చెప్పచ్చు.అయితే తెలంగాణ ఏర్పడ్డ 3 సంవత్సరాల తర్వాత  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సింహభాగం సంతోషంలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే దిగ్విజయ్ సింగ్ స్థానంలో ఆర్ సి కుంతియాన్ ఎఐసిసి తరపున తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్ఝ్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.ఆర్ సి కుంతియాన్ ఇదివరకు ఎఐసిసి కి కార్యదర్శి గా  వ్యవహరించారు.