ఒకేరోజు 25,000 మంది రిటైర్డ్.. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ - MicTv.in - Telugu News
mictv telugu

ఒకేరోజు 25,000 మంది రిటైర్డ్.. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ

June 1, 2022

తమిళనాడులో మంగళవారం ఒకేరోజు 25000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇంత మంది ఒకేరోజు రిటైర్ అవడం ఓ రికార్డుగా చెప్తున్నారు. సాధారణంగా వీరు 2020లోనే రిటైర్ కావాల్సిన వారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచారు. దాంతో వీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఇక వీరికి ఇవ్వాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ కోసం ఇప్పటి స్టాలిన్ ప్రభుత్వం రూ. 8 వేల కోట్లను కేటాయించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఒక లక్షా యాభైవేల ఖాళీలున్నాయి. తాజా రిటైర్‌మెంట్‌తో ఆ సంఖ్య మరింత పెరిగింది. రాబోయే కాలంలో ఆ రాష్ట్ర సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.