తెలంగాణలో.. జూన్ 3 నుంచి బడిబాట - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో.. జూన్ 3 నుంచి బడిబాట

May 31, 2022

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ పేరుతో రాష్ట వ్యాప్తంగా బడిఈడు పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్డుల నమోదు సంఖ్యను పెంచడం వంటివి చేపట్టనున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాధికారులతో సబితా ఇంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.”బడిఈడు పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. విద్యార్డుల నమోదు సంఖ్యను పెంచాలి. జూన్ 3 నుంచి నుంచి 30వ తేదీ వరకు ఈ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను ఉదయం 7 గంటల నుంచి 11 గంటలకు వరకు నిర్వహించాలి. ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ‘మన ఊరు-మన బడి’పై అవగాహన కల్పించాలి” అని ఆమె అధికారులను ఆదేశించారు.

ఇక, జూన్ నుంచి రాష్ట్ర ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న ఆమె తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, కాన్వెంట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు మారతాయన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, గతంలో సాధించిన ప్రగతిని వివరించి విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని అధికారులకు ఆమె సూచించారు.