తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. ఎనిమిది జిల్లాలో బుధవారం (ఈరోజు) భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ‘అసని’ తుపాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప, బయటికి వెళ్లకూడదని సూచించారు.
నేడు వర్షం పడనున్న జిల్లాలు ఇవే..
1. ఖమ్మం.
2. నల్గొండ.
3. సూర్యాపేట.
4. భద్రాద్రి కొత్తగూడెం.
5. మహబూబాబాద్.
6. ములుగు.
7. జయశంకర్ భూపాలపల్లి.
8. మంచిర్యాల
వాతావరణ శాఖ అధికారి శ్రావణి మాట్లాడుతూ..”వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. వడదెబ్బతో మంగళవారం వనపర్తిలో ఒకరు, కుమురం భీం, కాగజ్ నగర్లో ఒకరు మృతి చెందారు” అని ఆమె అన్నారు.