తెలంగాణ రాష్ట్రంలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదోవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 5,08,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు తెలిపారు.
ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ”ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదోవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి హాల్టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ హాల్ టికెట్లను WWW.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల నుంచి హాల్ టికెట్లను తీసుకోండి” అని ఆయన తెలిపారు.
”పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. మే 23న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్), 24న సెకండ్ లాంగ్వేజ్, మే 25న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్), 26న మ్యాథమెటిక్స్, 27న జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్), 28న సోషల్ స్టడీస్, 30న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ –1 (సంస్కృతం, అరబిక్), 31న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్), జూన్ 1న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు ఉంటాయి”