ఏపీలో కరోనా జ్వాలా.. ఒక్కరోజే 87 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కరోనా జ్వాలా.. ఒక్కరోజే 87 మంది మృతి

August 15, 2020

In the last 24 hours, 8,732 new positive cases were registered in ap

ఏపీలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడంలేదు. మొన్న కొన్ని రోజులు కాస్త చల్లబడ్డట్టే కేసులు తక్కువగా నమోదు అయినట్టే అనిపించినా.. మళ్లీ తన పాత ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. రికార్డు స్థాయిలోనే పాజిటివ్ కేసులను నమోదు చేస్తోంది. మరోవైపు మనుషుల ప్రాణాలను కూడా అన్యాయంగా తీసేస్తోంది. దీంతో ఏపీ ప్రజల్లో కరోనా ఫియర్ బాగా నాటుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 8,732  పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

తాజాగా 87 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 చొప్పున, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7 చొప్పున, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 6 చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 చొప్పున, కృష్ణా జిల్లాలో 3 మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 2,562కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,91,117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 10,414 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  కాగా, గత 24 గంటల్లో 53,712 నామూనాలు పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 28,12,197 కరోనా పరీక్షలు నిర్వహించారు.