ఈ మధ్యే నా లవ్ బ్రేక్‌ప్ అయింది: విశ్వక్‌సేన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మధ్యే నా లవ్ బ్రేక్‌ప్ అయింది: విశ్వక్‌సేన్

April 29, 2022

‘ఫలక్ నామా దాస్’ సినిమాతో తెలుగు చిత్రసీమ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో విశ్వక్‌సేన్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సెలబ్రిటీలతో పంచుకున్నారు. తాజాగా విశ్వక్‌సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలతో విశ్వక్ సేన్ ముచ్చటించారు.

‘మీ కెరీర్ మొదలైన రోజునుంచి ప్రతి సినిమాలో మీకొక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు చూపించారు కదా.. మీ నిజ జీవితంలో ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా?’ అని ఓ సెలబ్రిటి ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో విశ్వక్ సేన్ ఎమోషన్ అయ్యాడు. “ప్రతి ఒక్క మగాడి లైఫ్‌లో ఇలాంటి కథలు తప్పకుండా ఉంటాయి. ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ ఈ ట్రాజెడీకి గురవుతారు. అదే విషయాన్ని మేము సినిమాల్లో చూపిస్తున్నాం.

ఇక, నిజజీవిత విషయానికి వస్తే.. నాకొక బ్రేకప్ స్టోరీ ఉంది. సుమారు మూడేళ్లు పాటు ఓ అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించా. ఎందుకో తెలియదు. ఆమె నన్ను వదిలేసింది. ఆ విషయం నెల రోజుల క్రితమే నాకు తెలిసింది. ఇంతకు మించి ఆమె గురించి నేను ఏమీ చెప్పలేను. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకొస్తే, చాలా బాధగా ఉంటుంది” అని విశ్వక్ అన్నారు. మీకు కాబోయే భార్యకు ఏ క్యాలిటీస్ ఉండాలి అని అడగ్గా ‘నాకంటే ఎక్కువ తెలివి ఉండాలి” అని సమాధానం ఇచ్చారు.

‘ఈ నగరానికి ఏమైంది’, ‘పాగల్’ వంటి సినిమాలతో మాస్ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న విశ్వక్‌సేన్. కూల్, క్లాస్‌ లుక్‌లో ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’లో కనిపించనున్నారు. ఈ సినిమాను విద్యాసాగర్ చింతా దర్శకుడు తెరకెక్కించారు. మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.