In the name of current bill.
mictv telugu

కరెంట్ బిల్లు పేరుతో.. కోటి 6 లక్షలు కొట్టేశారు..

July 11, 2022

దేశంలో రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా డబ్బులు కాజేయాలని రకరకాల దారులను ఎంచుకుంటున్నారు. తాజాగా ముంబైలో కరెంట్ బిల్లుల పేరుతో ప్రజల నుంచి ఏకంగా కోటీ 6 లక్షల రూపాయలను కొట్టేశారు. విద్యుత్ అధికారుల పేరుతో, కొన్ని ఫోన్ నెంబర్లు క్రియేటి చేసి, ఈనెల కరెంట్ బిల్లును చెల్లించలేదంటూ, ప్రజల ఫోన్లకు మేసేజ్‌లు పంపి, వారి ఖాతాల నుంచి వేలకు వేల డబ్బులు కొట్టేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో నివాసముంటున్న 80 మందికి ఈనెల కరెంటు బిల్లులు చెల్లించాలని, లేకపోతే విద్యుత్తు కనెక్షన్ కట్ చేస్తామని కొన్ని నెంబర్లతో కూడిన మేసేజ్‌ను సైబర్ నేరగాళ్లు వారి ఫోన్లకు పంపించారు. దాంతో బాధితులు కరెంట్ బిల్లును చెల్లించారు. కానీ, ఎటువంటి మేసేజ్ రాలేదు. బాధితుల్లో వైద్యులు, నేవీ అధికారులు, విద్యార్థులు, హోటల్ యజమానులు ఉన్నారు. ఆందోళనకు గురైన 80 మంది కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేశారు. దాంతో కరెంట్ బిల్లును చెల్లించినట్లు ఎటువంటి డబ్బులు తమకు అందలేదని విద్యుత్ అధికారులు తెలియజేయడంతో ప్రజలు ఆందోళనకు గురై, పోలీసులకు ఫిర్యాదు అయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు సంచలన విషయాలను వెల్లడించారు.” ముంబైలో ఫేక్ కరెంటు బిల్లుల వ్యవహారంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఈనెల కరెంటు బిల్లు ఇంకా చెల్లించలేదంటూ, సైబర్ నేరగాళ్లు ముంబై వాసుల ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. కరెంటు బిల్లును చెల్లించడానికి, విద్యుత్తుశాఖ అధికారికి ఫోన్ నెంబర్లు ఇవే అంటూ పలు నెంబర్లతో కూడిన మరో మేసేజ్ పంపి, రాత్రికల్లా కరెంటు బిల్లు కట్టకపోతే, కనెక్షన్ కట్ చేస్తామని బెదిరించారు. దాంతో పలువురు ఆ నెంబర్లకు పే ఫోన్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించారు. అదే అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. కస్టమర్ల ఫోన్ నెంబర్‌తో వారి డిటైల్స్ అన్నీ లాగేసి, వాటి ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి కోటీ 6 లక్షల రూపాయల వరకు కొల్లగొట్టారు” అని వివరాలను వెల్లడించారు.