కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ, నెహ్రూల పేర్ల మీద మూడు నాలుగు తరాలకు కూర్చుని తినేందుకు కావాల్సినంత డబ్బు సంపాదించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మాత్రం త్యాగం చేయకపోతే మనకే మంచిది కాదని మనసులో మాట చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరైన నేపథ్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రమేష్ కుమార్ పైవిధంగా స్పందించారు. గతంలో అసెంబ్లీ వేదికగా అత్యాచారాల మీద తప్పుగా మాట్లాడి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ వ్యంగ్యంగా స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ఏవిధంగా దేశాన్ని దోచుకుందో ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా చురకంటించారు. కాగా, రమేష్ కుమార్ మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తాజా పరిణామాలు బీజేపీకి రాజకీయంగా లబ్ది చేకూరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ 60 ವರ್ಷಗಳ #LootIndia ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ವರ್ಣಿಸಿದ ಮೇಧಾವಿ ನಾಯಕರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು!
ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರೇ ಇಷ್ಟು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಭ್ರಷ್ಟಾಚಾರವನ್ನ ಒಪ್ಪಿಕೊಂಡಮೇಲೆ ಯಾವ ಮುಖ ಇಟ್ಟುಕೊಂಡು ಜನರ ಬಳಿ ಮತ ಕೇಳುತ್ತೀರಿ @INCIndia ನಾಯಕರೇ? pic.twitter.com/r0Kqt3OZpZ
— Dr Sudhakar K (@mla_sudhakar) July 21, 2022