కాషాయ టాయిలెట్..గుడి అనుకొని ఏడాదిగా పూజలు - MicTv.in - Telugu News
mictv telugu

కాషాయ టాయిలెట్..గుడి అనుకొని ఏడాదిగా పూజలు

November 9, 2019

దేశంలో రంగు రాజకీయాలకు కొదవలేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ రంగును వివిధ కట్టడాలకు పులుముతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఇందుకు చక్కని ఉదాహరణ. కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూత్రశాలలను కూడా వదలకుండా బీజేపీ పార్టీ రంగు పులిమారు. ఆ రంగులు ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. 

Uttar pradesh ..

హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహా గ్రామ ప్రజలు గత ఏడాదిగా ఓ కాషాయ రంగులో ఉన్న కట్టడాన్ని గుడిగా భావించి పూజలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆ కట్టడం తలుపులు తీయకపోవడంతో అందులో దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని భావించారు. దీంతో తలుపుల వద్దే పూజలు చేయడం ప్రారంభించారు. చివరికి అది మూత్రశాలల సముదాయం అని తెలుసుకుని షాకయ్యారు. ఈ సందర్భంగా స్థానికుడు రాకేష్ చందేల్ మాట్లాడుతూ..‘కమ్యునిటీ హెల్త్ సెంటర్‌ను ఆనుకుని ఈ టాయిలెట్‌‌ల సముదాయాన్ని నిర్మించారు. దీని డిజైన్ కూడా ఆలయం రూపంలోనే ఉంది. పైగా, దీనికి కాషాయం రంగు వేయడంతో ప్రజలంతా ఆ కట్టడాన్ని ఆలయంగా భావించారు. ఇటీవల గ్రామానికి వచ్చిన అతిథులు.. ఇది మందిరం కాదు మూత్రశాల అని చెప్పేవరకు ప్రజలు నమ్మలేదు. దీంతో ఆ మూత్రశాలకు గులాబీ రంగు వేయించారు’ అని తెలిపాడు. ఏడాది క్రితమే ఈ మూత్రశాల పూర్తయినా అనివార్య కారణాల వల్ల దాన్ని ప్రారంభించలేదు. అయితే, ఈ టాయిలెట్‌కు ప్రభుత్వమే కాషాయ రంగు వేయించిందా లేదా కాంట్రాక్టరే నేతలను మెప్పించేందుకు ఆ రంగు వేశాడా అనేది తెలియాల్సి ఉంది.