Inappropriate comments on wife..Policeman who shot three policemen
mictv telugu

భార్యపై అనుచిత వ్యాఖ్యలు..ముగ్గురు పోలీసులను కాల్చేసిన పోలీసు

July 19, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తనను మానసికంగా వేధిస్తున్నారని ఓ పోలీసు అధికారి తీవ్ర మనస్తాపానికి గురై.. తన సహచరులైన ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఢిల్లీ పోలీసులో ఒక్కసారిగా కలకలం రేగింది. అనంతరం నిందితుడు నేరుగా వెళ్లి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే..నిందితుడు ప్రబీణ్ రాయ్ (32) ఇండియన్ రిజర్వు బెటాలియన్‌లో పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఢిల్లీలోని హైదర్‌పూర్ ప్లాంట్ వద్ద భద్రతాపరమైన విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతని చేతిలో చనిపోయిన వారు సిక్కిం పోలీసు విభాగానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ఘటనకు ఎందుకు? పాల్పడ్డావని ఉన్నతాధికారులు విచారించగా, ”నా భార్యపై ఆ ముగ్గురు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, నన్ను పదే పదే మానసిక వేధింపులకు గురిచేశారు. అందుకే వారిని కాల్చేశాను” అని నిందితుడు ప్రబీణ్ రాయ్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అతని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

ప్రబీణ్‌ రాయ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కొన ఊపిరితో ఉన్న మరొకరిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.