క్లాస్ రూంలోనే అత్యాచారం.. ఏపీలో దారుణం.. - MicTv.in - Telugu News
mictv telugu

క్లాస్ రూంలోనే అత్యాచారం.. ఏపీలో దారుణం..

October 20, 2020

Incident in the classroom .. Atrocities in the Andhra Pradesh ..

వరుస అత్యాచార ఘటనలకు దేశంలో కొదవ లేకుండా పోతోంది. నిత్యం ఏ ఆడపిల్ల అత్యాచారానికి బలి అవుతుందో తెలియక ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మృగాళ్లు కూడా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. దివ్య తేజస్విని హత్య కేసు గురించి ఇంకా మరిచిపోకముందే.. తాజాగా ఏపీలోని చిత్తూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలోనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. 9,10వ తరగతి విద్యార్థుల కోసం ఏపీలో ప్రత్యేకంగా తరగతులను నడుపుతున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రుల అనుమతితోనే ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు కాకుండా నేరుగా తరగతులను నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌కు వెళ్ళింది. విద్యార్థికి బంధువు అయిన ఓ మైనర్ బాలుడు గత కొన్నిరోజులుగా ఆమె వెంట తిరుగుతున్నాడు. ప్రేమ పేరుతో ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని అతన్ని బాగా నమ్మింది. అయితే ఎప్పటిలానే ఆరోజు కూడా బడికి రావడంతో ఆ విద్యార్థిని అతనితో కలిసి మాట్లాడుతూ కూర్చుంది. 

అయితే ఉన్నట్లుండి ఆ మైనర్ బాలుడు మృగాడిలా మారిపోయాడు. విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఒంటిగంట దాటునతున్నా తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తండ్రి స్కూలు వద్దకు వెళ్ళాడు. అప్పటికే అత్యాచారం చేసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోతూ కనిపించాడు. జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పిందా ఆ విద్యార్థిని. దీంతో కుమార్తెతో పాటు వెళ్ళి వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గాలించి పట్టుకున్నారు. కాగా, ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని హత్య కేసు విషయమై దివ్య తల్లిదండ్రులు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సుమారు అరగంటకు పైగా జగన్‌తో ఈ ఘటనపై చర్చించారు. దివ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు దివ్య తండ్రి జోసెఫ్ మీడియా మందు చెప్పారు. హోం మంత్రి సుచరిత కూడా తమ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.