ఏపీలో ఘోరం.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఘోరం.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్ 

August 3, 2020

Incident on tribal woman in ap karnool.

కరోనా సమయంలోనూ నోటితో చెప్పలేని ఘోరాలు జరుగుతున్నాయి. కామాంధులు, దోపిడీదారుల ఆగడాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. కరోనా ఉందన్న భయం వారిలో ఏ కోశానా లేదు. మహిళలు, ఆడపిల్లలపై నిత్యం ఎక్కడోచోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో ఓ గిరిజన మహిళపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె భర్తను తీవ్రంగా కొట్టి దూరంగా పారేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా వెలుగోడులోని జమ్మినగర్ తాండాలో అర్థరాత్రి చోటు చేసుకుంది. గిరిజన వివాహిత భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో దుండగులు వారిమీద విరుచుకుపడ్డారు. భర్తను దూరంగా లాక్కెళ్లి కొట్టి పారేశారు. 

తమకు జరిగిన అన్యాయంపై భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డవారికి కఠిన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాధితురాలికి అండగా జమ్మినగర్ తండాలో గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.