పొడిబారిన జుట్టు…జిడ్డుగా ఉండే చర్మం..ఇవి చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. గజిబిజి జుట్టు మీకు బాధకలిగిస్తుంది. తగినంత పోషకాహారం, తేమ లేకపోవడమే బలహీనమైన,సంక్లిష్టమైన జుట్టుకు ప్రధాన కారణం. జుట్టు సంరక్షణ కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ ఫుడ్స్ జుట్టును మందంగా, పొడవుగా, ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు చర్మం మెరిసేలా చేస్తాయి. అవేంటో తెలుసుకోండి.
1. చియా సీడ్స్
చియా సీడ్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ గింజల్లో జింక్ అధిక మొత్తంలోఉంటుంది. ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించడంతోపాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. చియా సీడ్స్ ను నీటిలో నానబెట్టి లేదా మెత్తగా పొడి చేసి..సలాడ్స్ లో కానీ జ్యూస్ లో కానీ కలుపుకుని తీసుకోవచ్చు.
2. అవిసె గింజలు
అవిసె గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి ప్రేగులను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉణ్నాయి. ఇవి శాఖాహారులకు ఎంతో మేలు చేస్తాయి. అవిసెగింజలు యాంటీ ఏజింగ్ ఫుడ్ గా పరిగణిస్తారు.
3. గింజలు
గింజలను పోషకాహారానికి పవర్ హౌస్ అంటారు. ఇవి ఫైబర్ కు మంచి మూలం. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపును తగ్గించే గుణం వీటిలోఉంది. బాదం, వాల్ నట్స్ తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి. జుట్టు రాలడాన్ని నివారించడంలో బ్రెజిల్ నట్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ గింజలు జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి.
4. అవకాడో
ఇదొక సూపర్ ఫుడ్. జుట్టును మందంగా ఉంచడంతోపాటు జుట్టు రాలకుండా నిరోధిస్తుంది. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అంతేకాదు అవకాడోలో ఉండే యాంటీఆక్సిండెట్స్ దెబ్బతిన్న చర్మానికి పూర్వరూపం వచ్చేలా చేయడంతోపాటు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది.