ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ ఈ ప్రోటీన్ ఫుడ్ మీ డైట్‎లో చేర్చుకోండి. - MicTv.in - Telugu News
mictv telugu

ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ ఈ ప్రోటీన్ ఫుడ్ మీ డైట్‎లో చేర్చుకోండి.

March 9, 2023

మానవశరీర నిర్మాణానికి ప్రొటీన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. మన శరీరం నిర్మాణం మొత్తం కూడా ప్రొటిన్ అలాగే కొవ్వుతో తయారైంది. అందుకే ప్రొటిన్ శరీరానికి చాలా అవసరం. ప్రొటీన్ లోపం వల్ల శరీర నిర్మాణంలో అంతరాయం కలిగిస్తుంది. పాత కణాలను నాశనం చేయడం కొత్త కణాలను స్రుష్టించే ప్రక్రియ కూడా మానవశరీరంలో నిరంతరంగా కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన మానవ శరీరంలో ప్రతిరోజూ 330 బిలియన్ కొత్త కణాలను ఏర్పడతాయి. ఈ కణాలన్నీ ప్రొటీన్ తయారువుతాయి. అందుకే శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. కానీ అదే సమయంలో శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రొటీన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ప్రొటీన్ అధికం తీసుకోవడం వల్ల కూడా అనేక వ్యాధులు వస్తాయి.

ఇండియన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తగిన పరిమాణంలో తీసుకోవాలని సూచించింది. సంస్థ సిఫార్స్ చేసిన డైట్ చార్ట్ చూసినట్లయితే పుట్టినప్పటి నుంచి 6 నెలల వయస్సు వరకు శిశువు శరీరానికి రోజు పది గ్రాముల ప్రొటీన్ అవసరం. శిశువుకు తల్లిపాల ద్వారా ప్రొటీన్ అందుతుంది. రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ళ వరకు 15 నుంచి 28 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ప్రోటీని కోసం ఈ ఫుడ్స్ తీసుకోండి.

1. కోడిగుడ్లు:

ఉదయం అల్ఫాహారంలో మూడు ఉడికించి గుడ్లు తినాలి. ఇలా ప్రతిరోజూ అల్పాహారంలో మూడు కోడిగుడ్లు తీసుకున్నట్లయితే సెలీనియం కోలిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలతో పాటు 19 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్‌ మన శరీరానికి అందుతుంది.

2. పెరుగును స్నాక్‌గా తీసుకోండి:

పెరుగులో అధిక ప్రోటీన్ ఉంటుంది. 240-గ్రాముల సర్వింగ్‌లో 17-20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది సాధారణ పెరుగులో లభించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెరుగును స్నాక్ గా తీసుకోవాలి.

3. ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినండి:

ప్రతిరోజు ప్రారంభించడానికి కొన్ని డ్రైఫ్రూట్స్ ద్వారా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది రోజంతా ఆకలిని అరికట్టడానికి ఒక అద్భుతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి నానపెట్టిన బాదంపప్పు తింటే ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్ బూస్ట్ కోసం మీ రోజును కొన్ని వాల్‌నట్‌స్ కూడా తీసుకోవచ్చు.

4. మీ సలాడ్‌కు మొలకలను జోడించండి:

మీరు మీ సలాడ్‌లో పెసలు,శనగలు, రాజ్మా, పచ్చి బఠానీలను తీసుకోండి. మీరు ఇష్టపడే ఇతర పప్పు దినుసులను కూడా చేర్చుకోవచ్చు. మీ ఆహారంలో మొలకలను తీసుకోవడం ద్వారా అమైనో యాసిడ్ ప్రభావవంతంగా మెరుగుపరచవచ్చు.

5. మీ ఆహారంలో విత్తనాలను జోడించండి:

పొద్దుతిరుగుడు, చియా, సబ్జా, గుమ్మడికాయ, గార్డెన్ క్రేస్ పుచ్చకాయ వంటి విత్తనాలు, అలాగే లిపిడ్లు, ఫైబర్, మెగ్నీషియం, సెలీనియం ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే విత్తనాలను తినడం ద్వారా మీ శరీరానికి ప్రొటీన్ శాతం పెరుగుతుంది. వీటిని సలాడ్‌లు, సూప్‌లు, తృణధాన్యాలు డెజర్ట్‌ల రూపంలో తీసుకోవచ్చు.