రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

January 17, 2020

Rashmika Mandanna.

సంక్రాంతి పండగ రోజున బుధవారం నుంచి కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ఉన్న రష్మిక నివాసంలో ఆదాయపు పన్ను శాఖ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆమె ఇంట్లో లెక్కల్లో చూపని రూ. 25 లక్షలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు  వెల్లడించారు. అలాగే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఉన్న రష్మిక ఇంటి డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఆ ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఐటీ అధికారులు బుధవారం ఉదయం​ బెంగళూరు నుంచి విరాజ్‌పేటకు చేరుకున్నారు. ఆ సమయంలో సమయంలో రష్మిక  షూటింగ్‌లో బిజీగా ఉంది. దీంతో ఆమె తల్లిదండ్రులను అధికారులు ప్రశ్నించారు. ఆమె బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను ఆమె తల్లిదండ్రులను అడిగి పరిశీలించారు. అయితే ఆమెకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని రష్మిక మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోంది. కాగా, ఈ కన్నడ బ్యూటీ ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా రష్మిక- మహేష్‌బాబుతో కలిసి  నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.