ఢిల్లీలో చైనోడి మోసం..ఏకంగా రూ. 1000 కోట్ల అక్రమాలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో చైనోడి మోసం..ఏకంగా రూ. 1000 కోట్ల అక్రమాలు 

August 12, 2020

income tax department raids Chinese individuals.

దేశ ఢిల్లీలో చైనా దేశస్తుడి అక్రమాలు బట్టబయలు అయ్యాయి. చైనాకి చెందిన లువో సాంగ్‌ అనే వ్యక్తి ఢిల్లీలో ఉంటూ గూఢచర్యం, హవాలా, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతున్నాడని తేలింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి ప్రకటన ప్రకారం ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం రాత్రి ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్‌లలోని 21 చోట్ల సోదాలు నిర్వహించారు. అతడిపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. అతడి బాగోతాలు తవ్వుతుండగా విస్తుగొలిపే విషయాలు బయటికి వస్తున్నాయి. 

లువో గత కొంత కాలంగా ఢిల్లీలో వుంటూ బూటకపు చైనా కంపెనీలకు ప్రతినిథిగా చెప్పుకుంటూ, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. అతడిని 2018 సెప్టెంబర్ లో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గూఢచర్యం కేసులో అరెస్టు చేశారని తెలుస్తోంది. ఆ కేసు ఉంచి బయటికి వచ్చిన అతడు చార్లీ పెంగ్ అని కొత్త ఐడెంటిని సృష్టించుకుని నేరాలకు పాల్పడుతున్నాడు.  చైనీయుల పేరుతో 40కి పైగా బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమ చేశారు. లువో రూ.300 కోట్ల మేరకు హవాలా లావాదేవీలు నిర్వహించాడని వెల్లడైంది. అలాగే భారత పాస్‌పోర్టును సులువుగా పొందడం కోసం ఓ మణిపురి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. లువో పాల్పడుతున్న నేరాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు, ఛార్టర్డ్ అకౌంటెంట్ల కూడా సహకారిస్తునట్టు ఆదాయశాఖ అధికారులు గుర్తించారు.