మహర్షి సహనిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఐటి సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

మహర్షి సహనిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఐటి సోదాలు

May 8, 2019

తెలుగు చిత్రసీమ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లో శ్రీనగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లను క్షణ్ణంగా పరిశీలించారు. మహర్షి సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులను చెక్ చేశారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రానికి దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Income tax officials raid in dil raju office

ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధమౌతుండగా.. దిల్ రాజు ఆఫీసులో ఐటీ దాడులు జరగడం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. పెద్ద సినిమా విడుదల ముందు నిర్మాతల కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణంగా మారింది. గతంలో కూడా కొందరు నిర్మాతల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Income tax officials raid in dil raju office