Income tax raid engineer’s house in Bihar crores in cash
mictv telugu

ఇంజినీర్ ఇంట్లో 5 కోట్ల కట్టల పాములు.. మిషన్ తెప్పించి..

August 27, 2022

జీవితానికి భద్రత కల్పిస్తుందని ప్రభుత్వ ఉద్యోగం కోసం కోట్ల మంది రేయింబవళ్లు కష్టపడి చదువుతూ పరీక్షలు రాస్తుంటారు. దూరాభారాలకు వెళ్ళి ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. మరోపక్క.. కొందరు ప్రబుద్ధులు మాత్రం ప్రభుత్వం ఉద్యోగాన్ని ‘లీగల్ దోపిడీ’కి సాధనంగా మార్చుకుంటున్నారు. క్లర్కు నుంచి కలెక్టర్ దాకా స్వార్థం పురివిప్పితే చాలు లంచాలు కొండలు కొండలుగా పేరుకుపోతున్నాయి. బిహార్‌కు చెందిన ఓ సర్కారీ ఇంజినీరు కొంపలో రూ. 5 కోట్ల అక్రమ సొమ్ముతోపాటు భారీస్థాయిలో బంగారం, ఇతర ఆస్తులు బయటపడ్డాయి.

సంజయ్ కుమార్ రాయ్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు అసలుకంటే కొసరు ముద్దు అని తెలియడంతో ఐటీ అధికారులు దాడి చేశారు. పట్నా, కిషన్‌గంజ్‌లలోని అతని ఇళ్లతో సోదారు జరపగా రూ. కోట్ల నగదు దొరికింది. ఆస్తుల డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. నగదు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ తెప్పించారు అధికారులు. సంజయ్ కుమార్ రాయ్ ప్రస్తుతం రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో కిషన్‌గంజ్ డివిజన్‌లో గడ్డి తింటున్నాడు. కాగా అదే విభాగంలో పనిచేస్తున్న ఖుర్రం సుల్తాన్ అనే క్యాషియర్ ఇంట్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.