రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు

November 20, 2019

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి సంబందించిన రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని సురేష్‌బాబు ఇల్లు, రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. 

income tax.

మొత్తం మూడు చోట్ల ఒకేసారి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలుగు చిత్రసీమకు చెందిన కొందరు నటులు, దర్శకనిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. వెంకటేష్ సహా మొత్తం పది చోట్ల సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం జరిపే తనిఖీలలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సురేష్ బాబు వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా వెంకీమామ అనే సినిమాను నిర్మిస్తున్నారు. దీని తర్వాత రానా హీరోగా హిరణ్య కశ్యప అనే సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని సమాచారం.