income tax raids in hyderabad excel group of companies today
mictv telugu

హైదరాబాద్లోని ఎక్సెల్ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో ఐటీ దాడులు

January 4, 2023

income tax raids in hyderabad excel group of companies today

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సులలో సిబ్బంది ఐటీ ఆఫీస్ నుంచి బయలుదేరిన అధికారులు.. 20 బృందాలుగా విడిపోయి మొత్తం 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయం, మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్.. ఇన్ఫ్రా, ఐటీ గ్రూప్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించిన ఆఫీసులు, యజమాని ఇండ్లపై తెల్లవారుజామున 4 గంటలకే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 60 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. బాచుపల్లి, చందానగర్‌లోనూ కొనసాగుతున్న ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కాగా.. ఇటీవలే హైదరాబాద్‌లో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో నగరంలోని పలు వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. కాగా, చెన్నైలోని ఎక్సెల్‌ ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా 18 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.