దోమతెరల వెనక రూ.36 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

దోమతెరల వెనక రూ.36 కోట్లు

November 18, 2019

income tax Raids on Shobika Impex Company Tamil Nadu

దోమతెరలు తయారీ సంస్థ యజమాని ఆఫీస్, ఇంట్లో జరిగిన ఐటీ శాఖ సోదాల్లో రూ.36 కోట్ల నగదు పట్టుపడడం సంచలనం అవుతోంది. తమిళనాడులోని కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ తెరల తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు దోమతెరలు ఎగుమతి అవుతుంటాయి. 

శివస్వామి కంపెనీలో సంవత్సరానికి రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతోంది. శివస్వామి పన్ను ఎగవేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులకు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు నవంబర్ 15 శుక్రవారం నాడు కరూర్ జిల్లాలోని వెణ్నైమలైలో ఉన్న శివస్వామి ఆఫీసులు, రామ్‌నగర్‌లోని ఇల్లు, దోమతెరల పరిశ్రమలో సోదాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన సోదాల్లో.. అల్మరాల్లో దాచి పెట్టిన లెక్కలోకి రాని రూ.36 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో దొరికిన విలువైన పత్రాల గురించి విచారణ నిర్వహిస్తున్నారు. చెన్నై, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 20 మంది అధికారులు పాల్గోన్నారు.