కేంద్ర బడ్జెట్ వేతనజీవులకు ఊరట కల్పిస్తూ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. పన్ను శ్లాబులను ఆరు నుంచి ఐదుకు కుదించింది. అయితే పాత పన్ను శ్లాబులను ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కొత్త పరిమితి రూ. 7 లక్షలకు మధ్యతరగతి ఆదాయ వర్గాలకు ఊరటనిచ్చేదే. ఈ పరిమితిలోపు ఆదాయం ఉన్నవాళ్లు పన్ను పోటు తప్పించుకోవాంటే మినహాయింపులు చూపాలి.
రూ. 3లక్షల లోపుంటే బేఫికర్
కొత్త బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం వ్యక్తిగత వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉంటే పైసాకూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. 7 లక్షల లోపు ఉంటే.. తొలి మూడు లక్షలు మినహాయించి మిగిలిన 4 లక్షలకు పన్ను కట్టాలి. అయితే ఈ 4 లక్షలకు కూడా ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పన్ను నుంచి గరిష్ట మొత్తానికి మినహాయింపు కోరొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80 డి, ఈ, డీడీ, సెక్షన్ 10 వంటి పలు సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. చాలా కంపెనీల్లో హెచ్ఆర్ఏ విభాగాలు ఉద్యోగులకు ఈ విషయంలో సలహాలు ఇస్తుంటారు. ప్రైవేటు ఆడిటర్లు కూడా పన్నుపోటు తగ్గిస్తుంటారు. మొత్తానికి మొత్తం మినహాయింపు కోరకుండా ఎంతో కొంత పన్ను చెల్లించడం వల్ల క్రెడిబిలిటీ ఉంటుంది, రుణాల మంజూరు విషయాల్లో ప్రయోజనం ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా.
మినహాయింపులు..
పీపీఎఫ్, గృహరుణం, దానిపై వడ్డీ చెల్లింపులు
జాతీయ పింఛను పథకం
బీమా ప్రీమియంలు
ఈక్విటీ లింకెడ్ సేవింగ్ స్కీమ్
ఎడ్యుకేషన్ లోన్, వడ్డీ చెల్లింపు
సుకన్య సమృద్ధి పథకం
ఫిక్సిడ్ డిపాజిట్
విరాళాలు
ఇంటి అద్దె