నటుడు నాని ఇల్లు, ఆఫీస్‌లో ఐటీ సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు నాని ఇల్లు, ఆఫీస్‌లో ఐటీ సోదాలు

November 20, 2019

తెలుగు చిత్రసీమ ప్రముఖులే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్‌లలో సోదాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. 

Incometax.

తాజా సమాచారం ప్రకారం నటుడు నానిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు.