Increase of seats in AP, Telangana only after 2031: Centre
mictv telugu

ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే సీట్ల పెంపు: కేంద్రం

July 28, 2022

గతకొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభలో ఆయా పార్టీల ఎంపీలు పలుమార్లు సభను వాకౌట్ చేస్తూ, బయటికొచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతున్న వర్షకాల సమావేశాల్లోనూ ఏపీ, తెలంగాణ ఎంపీలు మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించనంతవరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తేల్చి తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్టికల్ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 28(1) చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

”రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్ 26కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదు. 2026 తర్వాత జనాభా లెక్కలు అంటే 2031లో జరుగుతాయి. ఆ లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ఎంత వేగంగా చేసినా 2034 లేదా 2039 ఎన్నికల నాటికే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని నిత్యానంద రాయ్ అన్నారు.