వర్క్ ఫ్రం హోంతో ల్యాప్‌టాప్‌లకు పెరిగిన గిరాకీ.. భారీ డిస్కౌంట్లతో.. - MicTv.in - Telugu News
mictv telugu

వర్క్ ఫ్రం హోంతో ల్యాప్‌టాప్‌లకు పెరిగిన గిరాకీ.. భారీ డిస్కౌంట్లతో..

May 28, 2020

,mj

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. పలు  కంపెనీలు కూడా ఈ ప్రక్రియ వైపు మొగ్గు చూపుతుండటంతో దేశవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లకు బాగా డిమాండ్‌ పెరిగింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సంస్థలు రాయితీలు, గిఫ్ట్‌ కార్డులను ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మల్టీబ్రాండ్‌ షోరూం ఐటీ మాల్‌.. లెనోవో,హెచ్‌పీ, డెల్‌, ఏసర్‌, ఆసుస్‌ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లపై 15 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. 

అలాగే స్క్రాచ్‌ కార్డుతో మొబైల్‌, ట్యాబ్లెట్‌ వంటి బహుమతులు గెలుచుకొనే అవకాశం కూడా కల్పించింది. రూ.50 వేల వరకు క్యాష్‌బ్యాక్‌, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8 వేల యాక్సెసరీస్‌ సైతం అందుకోవచ్చునని సంస్థ వెల్లడించింది. ఒకేసారి 25కి పైగా యూనిట్లను కొనుగోలు చేసే ఇన్‌స్టిట్యూషనల్‌ కస్టమర్లకు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ, యాక్సెసరీస్‌పై 25 శాతం వరకు తగ్గింపు పొందవచ్చునని కంపెనీ ఎండీ అహ్మద్‌ పేర్కొన్నారు.