గత కొంతకాలంగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయనే ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ బుధవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయం తీసుకుంది. యూనిట్‌కు 14 శాతం పెంచేందుకు అనుమతినిచ్చింది. దీని ప్రకారం.. గృహావసరాలకు వాడే విద్యుత్‌పై యూనిట్‌కు 40-50 పెసలు పెరగనుంది. కమర్షియల్ కేటగిరీపై రూపాయి చొప్పున భారం పడనుంది. డిస్కంలు భారీ ద్రవ్యలోటును ఎదుర్కొంటుండగా, గతంలోనే ఛార్జీల పెంపు ప్రతిపాదన వచ్చింది. 19 శాతం వరకు పెంచాలని డిస్కంలు కోరగా, ఈఆర్సీ 14 శాతానికే అనుమతినిచ్చింది. కాగా, ఈ పరిణామంతో దాదాపు ఏడేళ్ల తర్వాత తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగినట్లయింది. తాజా పెంపు నిర్ణయంతో డిస్కంలకు రూ. 6831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. దాంతో డిస్కంల లోటు రూ. 2686 కోట్లకు తగ్గుతుంది.