ప్రముఖ పాల సంస్థ అమూల్ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పాలపై ఏకంగా రూ.4 పెంచుతున్నామని ప్రకటించింది. ఓ వైపు పాల ఉత్పత్తిదారులకు ఇతర సంస్థల కంటే మెరుగైన రేటును ఇస్తామని చెబుతూనే.. తాజాగా వినియోగదారులపై భారాన్ని మోపింది. ఈ సందర్భంగా సోమవారం దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.
అందులో పేర్కొన్న అంశాలు ఇవే..
1. అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నాం.
2. ఇక నుంచి లీటర్ పాలపై రూ. 4 పెంచాం.
3. అర లీటర్ ధర రూ.28 నుంచి 30కి పెంచాం అని తెలిపింది.
అంతేకాకుండా పెరిగిన ధరలు మార్చి 1 (రేపటి) నుంచే అమల్లోకి రానున్నాయని అమూల్ తెలిపింది. పాల ధరలతో పాటు తన బ్రాండ్‌కు చెందిన అన్ని ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయని, పెరిగిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని కూడా అమూల్ తెలిపింది.