మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్.. ఎంతంటే?

April 5, 2022

pertol

దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు జాలి, దయ, కనికరం అనేవి లేకుండా సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా తమ కంపెనీ లావాదేవీలను కాపాడుకోవటం కోసం ధరలను పెంచుతున్నామని ప్రకటించి, వాహనాదారుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలను రోజురోజుకు పెంచుకుంటుపోతున్నాయి. దీంతో సామాన్యులు బండిని బయటకు తీయలంటే గజగజ వణికిపోతున్నారు.

తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్‌ కమిషన్‌, వ్యాట్‌ తదితర అంతా కలిపితే, లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్‌ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా, లీటరు డీజిల్‌ ధర రూ.104.62కి చేరుకుంది.

మరోపక్క చమురు కంపెనీలు ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్‌ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్‌ ధర రూ. 10.57లు పెరిగింది.