నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్ బౌలర్లు విజృంభించారు. ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 177 పరుగులకే ఆలౌట్ చేశారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి కంగారులను దెబ్బకొట్టగా..అశ్విన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ఆరంభంలో సిరాజ్, షమీ తలో వికెట్ తీసి ఓపెనర్లను రెండు పరుగులకే పెవిలియన్‌కు పంపించారు. 49 పరుగులు చేసిన లబూషేన్ ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్ 37, హ్యాండ్స్ కాంబ్ 31, అలెక్స్ క్యారీ 36 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా రెండెంకల స్కోర్‌నే చేయలేకపోయారు. ఆసీస్ బ్యాటర్లలో మొత్తం ముగ్గురు డకట్ గా వెనుదిరిగారు. 57.3 ఓవర్ లో కమ్మిన్స్ ఔట్ చేసిన అశ్విన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరఫున 450 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా తరిత్రకెక్కాడు. అనిల్ కుంబ్లే (619) అగ్రస్థానంలో ఉండగా అశ్విన్ (451) రెండో స్థానంలో ఉన్నాడు.